- Advertisement -
క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల పరిశీలన
నవతెలంగాణ – మిర్యాలగూడ
గత మూడు రోజులు కురిసిన వర్షాల కారణంగా నేలకొరిగిన వరి పంటలను వ్యవసాయ అధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిర్యాలగూడ మండలoలోని తుంగపాడు, వెంకటాద్రిపాలెం, గోగువారి గూడెం గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లో సర్వే చేసి నేలకొరిగిన వరి పంటను గుర్తించారు.
మండలంలో మొత్తం 42,500 ఎకరాలలో వరి పంట సాగు చేయగా, అందులో సుమారు 6,720 ఎకరాలు వర్షాల కారణంగా నేలవాలినట్లు నిర్ధారించారు.ఈ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఇన్చార్జి ఏ డి ఏ సైదా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు షఫీ, రమేష్, కృష్ణ, గోపి రైతులు లింగయ్య, రవీందర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


