– ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎం.నాగమణి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో ఈనెల 21 నుండి 23వ తేదీ వరకు 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ అండర్-17 బాల బాలికల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎం.నాగమణి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆమె గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్-17 టోర్నమెంట్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ టోర్నీలో పాత పది జిల్లాల నుండి 320 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. క్రీడలు విజయవంతంగా సాగేందుకు ప్రతి ఒక్క సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్-17 పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



