- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి, అంతంపల్లి, జంగంపల్లి, భిక్కనూర్, రామేశ్వర్ పల్లి, తిప్పాపూర్, బస్వాపూర్ గ్రామాలలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో 72వ అంతర్జాతీయ సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సొసైటీలలో సొసైటీ చైర్మన్లు, క్లస్టర్ అధికారులు సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అయా సొసైటీల చైర్మన్లు భూమయ్య, రాజా గౌడ్, సిద్ధ రాములు, సొసైటీల డైరెక్టర్లు, సీఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



