5,880 మంది లొంగుబాటు
వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ : గత ఏడేండ్లలో అంటే 2019 నుంచి ఇప్పటి వరకూ 7,400 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. మరో 5,880 మంది మావోయిస్టులు పోలీసులు ముందు లొంగిపోయారు. ఈ వివరాలను మంగళవారం లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది. వామపక్ష తీవ్రవాద హింస 2010తో పోలిస్తే 88 శాతం తగ్గిందని కేంద్రం తెలిపింది. ఈ హింసా సంఘటనలు 2010లో 1,936 జరగ్గా, 2025లో ఈ సంఖ్య 234కి తగ్గిందని చెప్పింది. అలాగే 2018లో 126గా ఉన్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య 2025 డిసెంబరు నాటికి కేవలం ఎనిమిదికి తగ్గిందని తెలిపింది. అందులో ఇప్పుడు మూడు జిల్లాలోనే అత్యంత ప్రభావ వంతంగా ఉందని వెల్లడించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రారు ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాలను తెలిపారు. వామపక్ష తీవ్రవాద సంబందిత హింసను నియంత్రించేలా పోలీస్ స్టేషన్ల సంఖ్య 2020లో 465 ఉండగా, 2025లో ఈ సంఖ్య గణనీయంగా 119కు తగ్గింది. ఇక 2025లో 364 మంది మావోయిస్టులను భద్రతాదళాలు హతమార్చా యని, 1022 మందిని అరెస్టు చేశారని, మరో 2,337 మంది మావోయిస్టులు లొంగిపోయారని మంత్రి తెలిపారు.వామపక్ష తీవ్రవాదాన్ని ఇటీవలి కాలంలో గణనీయంగా అరికట్టామని, దీన్ని కొన్ని ప్రాంతా లకే పరిమితం చేశామని రారు చెప్పారు. ఇందు కోసం వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్ధిక వనరులను అరికట్టడం, సీపీఐ(ఎంఎల్) నాయ కులు, వారి ఆర్థిక సహాయకుల మధ్య సంబంధా లను వెలికితీయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు మంత్రి చెప్పారు. అలాగే, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. రహదారి నెట్‌వర్క్ ను విస్తరించడం, టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీని మెరుగుపర్చడం, విద్యా-నైపుణ్యాభివృద్ధి కార్యక్ర మాలు వంటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 46 ఐటీఐలు, 49నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు (ఎస్‌డీసీ లు) ప్రారంభించినట్టు చెప్పారు. గిరిజన ప్రాంతా ల్లో నాణ్యమైన విద్య కోసం 179 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు.
ఏడేండ్లలో 7,400 మంది మావోయిస్టులు అరెస్టు
- Advertisement -
- Advertisement -



