నవతెలంగాణ – వనపర్తి
జలాశయాల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం వారు 7వ చిన్న నీటి వనరుల గణన ను దేశ వ్యాప్తంగా 2023-24 ను ప్రామాణిక సంవత్సరంగా తీసుకుని అన్నిరకాల సాగు నీటి పారుదల వనరుల గణనను జియో ట్యాగింగ్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ సర్వే కు జిల్లా కలెక్టర్, జిల్లా ఛార్జ్ ఆఫీసర్ గా, మండల తహశీల్దార్ లు మండల ఛార్జ్ ఆఫీసర్లు గా , గ్రామ పరిపాలన అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నిక్ అసిస్టెంట్లు క్షేత్ర సిబ్బంది గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సర్వే పర్యవేక్షణకు అర్థ గణాంక శాఖ హైదరాబాద్ నుండి శ్రీ మహేందర్ రెడ్డి, సహాయ సంచాలకులు గారు జిల్లాలో క్షేత్ర స్థాయి లో శ్రీనివాసపురం గ్రామం వనపర్తి మండలంలో పరిశీలించి, ఇట్టి సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీ హరికృష్ణ గారు, ఉప గణాంక అధికారులు,మండల ప్రణాళిక & గణాంక అధికారులు, ఎన్యూమరెటర్లు పాల్గొన్నారు.
7వ చిన్న నీటి వనరుల గణన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



