Sunday, January 25, 2026
E-PAPER
Homeకరీంనగర్8 మంది మావోయిస్టుల లొంగుబాటు

8 మంది మావోయిస్టుల లొంగుబాటు

- Advertisement -

– మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి : రామగుండం సీపీ
నవతెలంగాణ – గోదావరిఖని

ఎనిమిది మంది మావోయిస్టులు శనివారం రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మిలీషియా, కోరియర్‌, సాంస్కృతిక విభాగం, లోకల్‌ కమిటీ మావోయిస్టులున్నారు. వీరు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ అంబర్‌ కిషోర్‌ మాట్లా డుతూ.. ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడి మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వచ్చినట్టయితే, తెలంగాణ ప్రభుత్వం పునరావాస పథకాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. వారు స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. లొంగిపోయిన సభ్యులకు ప్రభుత్వం తరపున అన్ని ప్రతిఫలాలనూ అందజేయడానికి రామగుండం కమిషనరేట్‌ పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. సమాజంలో యువత చైతన్యవంతంగా వ్యవహరిస్తోందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటోందని, మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్‌ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లా మావోయిస్టులు కూడా వారి గ్రామాలకు తిరిగి రావాలని కోరారు.లొంగిపోయిన వారిలో వెల్గటూర్‌ మండలం చెగ్యాం గ్రామానికి చెందిన ధర్మాజీ శ్రీకాంత్‌ (మావోయిస్టు కొరియర్‌), పొడియం కాములు (మిలీషియా కమాండర్‌), ముడియం జోగ (సాంస్కృతిక ప్రచార కార్యకర్త), కుంజం లక్కె (పార్టీ మెంబర్‌), మోదం భీమ (మిలీషియా సభ్యుడు), కుంజం ఉంగా (జీఏడీ కమాండర్‌), ముడికం సుక్రం (మిలీషియా సభ్యుడు), ముడియం మంగు (మిలీషియా సభ్యుడు) ఉన్నారు. కాగా, ఇందులో శ్రీకాంత్‌ ఒక్కడే తెలంగాణ వ్యక్తి. మిగిలిన వాళ్ళందరూ ఛతీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా గాంగేలురు పోలీస్‌ స్టేషన్‌ పరిధి గంపుర్‌ గ్రామస్తులు. ఈ సమావేశంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ శ్రీనివాస్‌, ఎఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, ఇన్స్‌పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్‌, భీమేష్‌, ఆర్‌ఐ శేఖర్‌, ఆర్‌ఎస్‌ఐలు వెంకట్‌, శివ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -