-ఎంపీడీవో తుమ్మల రేవంత్ రెడ్డి ఆదేశాలు
నవతెలంగాణ – ఉప్పునుంతల
గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో మండల పరిషత్ అభివృద్ధి అధికారి తుమ్మల రేవంతి రెడ్డి సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ నాటికి సుమారు 80 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు.
అలాగే నర్సరీలలో విత్తనాలు నాటడం, షెడ్నెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సూచించారు. మండలానికి మంజూరైన కమ్యూనిటీ సోక్ పిట్స్ పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, హౌసింగ్ ఏఈలు, ఏపీవో పర్వతాలు, ఈసీ కుర్మారెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.



