రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 388 మెడికల్ పీజీ సీట్లు
మంత్రి రాజనర్సింహ విజ్ఞప్తితో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలో పీజీ వైద్య విద్య విద్యార్థులకు గత పదేండ్లుగా జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిం ది. మెడికల్ పీజీ యాజమాన్య కోటా సీట్ల భర్తీలో తెలంగాణ విద్యార్థులకు 85 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇప్పటివరకూ యాజమాన్య కోటా సీట్లన్నీ ఆల్ ఇండియా కేటగిరీలో భర్తీ అవుతున్నా యి. ఇక నుంచి 85 శాతం సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడికల్ పీజీ కోటాలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థుల కు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ పీజీ సీట్లు, 70 డెంటల్ పీజీ సీట్లు కలిపి మొత్తం 388 సీట్లు అదనంగా రానున్నాయి. ఇందుకు సంబంధించి వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలంటూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో పీజీ కోసం ఎంబీబీఎస్ విద్యార్థులు పడుతు న్న కష్టాలపై ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకు న్నందుకు సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం హకు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. వైద్య విద్యపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పీసీసీ డాక్టర్స్ సెల్ చైర్మెన్ డా. రాజీవ్ పేర్కొన్నారు. ఇకపై యాజమాన్య కోటా సీట్లలో సింహభాగం తెలంగాణ స్థానికులకే దక్కుతాయనీ, ఇది శుభపరిణామమని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య మరింతగా పెరగనుంది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది దోహదపడుతుంది.
పదేండ్లుగా అన్యాయం
మెడికల్ పీజీ స్టేట్ కోటా యాజమాన్య సీట్ల భర్తీలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతూ వచ్చింది. 25 శాతంగా ఉన్న యాజమాన్య కోటా-1 సీట్లలో తెలంగాణలో మాత్రం 100 శాతం ఆల్ ఇండియా కోటాగా చూపిస్తూ వస్తే ఏపీలో మాత్రం ఇదే కోటాను 85 శాతం స్థానికులకే రిజర్వ్ చేశారు. తెలంగాణ లోనూ 25 శాతంగా ఉన్న యాజమాన్య కోటా-1 సీట్లలో తెలంగాణలోనూ 85 శాతం స్థానికులకే కేటాయించాలని రాష్ట్రానికి చెందిన వైద్య విద్యార్థులు, వారి తల్లితండ్రులు, వైద్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదన్న ఆరో పణలు వచ్చాయి. గతేడాది వరకు కూడా ప్రభుత్వం పాత విధానంలోనే సీట్లను కేటాయించింది. స్థానిక కోటా లేకపోవడంపై తెలంగాణ వైద్య విద్యా ర్థులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో ఇస్తున్నప్పుడు ఇక్కడెం దుకు అన్యాయం జరుగుతున్నదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకున్న వైద్య మంత్రి దామోదర రాజనర్సింహ ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. మంత్రి విజ్ఞప్తికి స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ఉత్తర్వులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పదేండ్లపాటు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయానికి తెరపడింది.
తెలంగాణ విద్యార్థులకు దక్కనున్న 388 పీజీ సీట్లు
ప్రస్తుత విద్యాసంవత్సరం (2025-26)లో రాష్ట్రంలో 31 పీజీ మెడికల్ కాలేజీలు 2,983 సీట్లను అందిస్తున్నాయి, వాటిలో 12 ప్రభుత్వ (1,472 సీట్లు), 19 ప్రయివేట్ కాలేజీలు (1,511 సీట్లు) ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలలో 50 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద, 50 శాతం సీట్లు రాష్ట్ర కోటా పరిధిలోకి వస్తాయి. ప్రయివేట్ కాలేజీలలో 50 శాతం రాష్ట్ర కోటా పరిధిలోకి, మిగిలిన 50 శాతం యాజమాన్య కోటా కిందకు వస్తాయి. 741 పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్లలో 374 సీట్లు యాజమాన్య కోటా-1 (ఎంక్యూ-1)కు చెందినవి. ప్రభుత్వం సవరించిన కొత్త విధానం ప్రకారం 318 సీట్లు (85 శాతం) ఇప్పుడు తెలంగాణ స్థానికత ఉన్న అభ్యర్థు లకు రిజర్వ్ చేయబడతాయి. 56 సీట్లు (15 శాతం) ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. అలాగే 70 డెంటల్ పీజీ సీట్లు కూడా తెలంగాణ విద్యా ర్థులకే దక్కుతాయి. మొత్తంగా పీజీ మెడికల్, పీజీ డెంటల్ కలిపి తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకు 388 సీట్లు అదనంగా లభించనున్నాయి.
వైద్యరంగంలో కీలకమైన నిర్ణయం : దామోదర రాజనర్సింహ
రాష్ట్ర వైద్య చరిత్రలో ఇది మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. వైద్య విద్యార్థులు ఈ నిర్ణయం కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఎట్టకేలకు ఇది సాకారమైందన్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణలో ప్రతిభావంతులైన యువ వైద్యులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని వివరించారు. రాష్ట్ర ఆరోగ్య రంగం మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. విద్యార్థుల పక్షాన, తెలంగాణ పక్షాన ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మెడికల్ పీజీ యాజమాన్య కోటాలో 85 శాతం సీట్లు స్థానికులకే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



