నవతెలంగాణ – కామారెడ్డి
గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో డిఐపిసి యొక్క ఛైర్మన్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ డిఐపిసి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ – ఐ పాస్ ఆన్లైన్ మొత్తం దరఖాస్తులు (1511) దానిలో (1462) పరిశీలన (1462) ఆమోదం పొందినవి , (205) వివిధ కారణాల వలన తిరస్కరించబడినవి. టీ – ప్రయిడ్ ( T-PRIDE ) స్కీమ్ ఎస్సిపి ( SCP ) కింద ఎజెండా అంశాలను చర్చించారు. (03) దరఖాస్తులు మంజూరైన పెట్టుబడి రాయితీ రూ.8,93,203/- (ఎనిమిది లక్షల తొంబై మూడు వేళా రెండు వందల మూడు రూపాయలు మాత్రమే) డీఎస్పీ ( TSP ) (04) మంజూరైన దరఖాస్తులు పెట్టుబడి సబ్సిడీ మొత్తం రూ.13,20,872/- (పదమూడు లక్షల ఇరవై వేళా ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు మాత్రమే). మంజూరి చేయబడినవి. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ వి లాలూ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



