Tuesday, July 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిచ్చికుక్క స్వైర విహారం 9 మందికి గాయాలు...

పిచ్చికుక్క స్వైర విహారం 9 మందికి గాయాలు…

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో సోమవారం పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ 9 మంది పై దాడి చేసింది వీరిలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వారికి మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్సలు జరిపించి నిజామాబాద్ ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. పిచ్చికుక్క దాడిలో గాయాల పాలైనవారు. ఎస్.కె కాజామీయా, ఎస్.కె ఆస్లం, బేబీ, ఈరేషం, ఎస్.కె హార్బస్, లాలాగౌడ్, మోహన్, షేక్ అమన్, రాములు, కాగా తీవ్రంగా గాయపడ్డ బేబీ, అస్లం, కు నిజామాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలియజేశారు. కుక్కల బెడద అధికంగా ఉన్నప్పటికీ వాటి నివారణ చర్యలు చేపట్టకపోవడం పిచ్చికుక్కలు ప్రజలపై దాడులు చేయడం గ్రామస్తులంతా భయాందోళనలకు గురి అవుతున్నారు కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -