- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈ సోమవారం 90 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించి ఆయా దరఖాస్తులు అధికారులకు ఇస్తూ పెండింగ్ లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు విక్టర్ మదన్ మోహన్, సీఈఓ చందర్, ఆర్డీవో వీణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


