Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ

ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ

- Advertisement -

జీహెచ్‌ఎంసీ వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ అమలు
అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగించుకోవాలి : జీహెచ్‌ఎంసీ


నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆస్తి పన్ను బకాయిలపై వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పథకం 2025-26ను కొనసాగిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు గురువారం తెలిపారు. ఈ పథకం ద్వారా ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 90 శాతం మాఫీ లభించనుంది. పన్ను చెల్లింపుదారులు పూర్తి ట్యాక్స్‌తోపాటు 10 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను సులభంగా పరిష్కరించుకునే అవకాశం కలుగుతుంది. పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుని నగరాభివృద్ధికి సహకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఓటీఎస్‌ పథకం కింద చెల్లింపులను ‘మైజీహెచ్‌ఎంసీ’ యాప్‌, మీ సేవ కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు (సీఎస్‌సీఎస్‌), ఆన్‌లైన్‌ ద్వారా చేయొచ్చు. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించడం ద్వారా నగర మౌలిక సదుపాయాలు, పౌర సేవలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -