Monday, January 12, 2026
E-PAPER
Homeజిల్లాలు90 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

90 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ – టేకుమట్ల 
పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే సన్నబియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాలీలను ,90 క్వింటానుల సన్నబియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ దాసరి సుధాకర్ తెలిపారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు టేకుమట్ల మండలం బుర్నపల్లి గ్రామ మానేరు వాగు మీదుగా కాల్వ శ్రీరాంపూర్ నుండి మహారాష్ట్ర సిరివంచకు వెళుతున్న మూడు ట్రాలీలలోనీ  90 క్వింటానుల సన్నబియ్యాన్ని సివిల్ సప్లై ఆర్ఐ రాజు పట్టుకొని టేకుమట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై దాసరి సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామానికి చెందిన బొమ్మల శ్రీధర్ (28), జక్కుల శ్రీకాంత్, రేగొండ మండలం కోడువటాంచ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్ (25) రేగొండ, గోరికొత్తపల్లి మండలాలలో గల పిడిఎస్(రేషన్) సన్నబియ్యాన్ని తక్కువ ధరకు కొని సిరివంచలోని వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముకోవాలని వారు భావించారు.

అయితే పోలీసులు పక్కా సమాచారం మేరకు టేకుమట్ల మండలం బోర్నపల్లి మానేరు వాగు మీదుగా కాలువ శ్రీరాంపురం మండలం నుండి సిరివంచ కు బియ్యాన్ని తీసుకు వెళ్తున్న క్రమంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఆర్ఐ రాజు పట్టుకున్నారు. ఈ క్రమంలో మూడు వాహనాలను, ముగ్గురు వ్యక్తులను, బియ్యాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సివిల్ సప్లై ఆర్ ఐ రాజు తెలిపారు. ఫిర్యాదు మేరకు వాహనాలను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -