Monday, November 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలురైలు ఢీకొని 90 గొర్రెలు మృతి

రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కామారెడ్డి శివారులో ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొనడంతో 90కి పైగా గొర్రెలు మృతి చెందాయి. దేవునిపల్లికి చెందిన సుధాకర్ మరో వ్యక్తితో కలిసి ఫైర్ స్టేషన్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద గొర్రెలు మేపుతుండగా ఈ ఘటన జరిగింది. రైలు వేగంగా రావడంతో మంద మొత్తం పట్టాలపై చిక్కుకుంది. భయంతో సుధాకర్ పక్కనున్న వాగులోకి దూకగా, ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యాడు. గాలింపు తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -