Tuesday, February 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం92.5 శాతం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌

92.5 శాతం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌

- Advertisement -

– భువనేశ్వర్‌ కెఐఐటీ డీమ్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన 757 కంపెనీలు
– 4,621 మందికి ఉద్యోగాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్లేస్‌మెంట్‌ ఇప్పించడంలో మరోసారి భువనేశ్వర్‌ కెఐఐటీ డీమ్డ్‌ యూనివర్సిటీ ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది. గత విద్యా సంవత్సరాల్లో ఆన్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో బెస్ట్‌ అనిపించుకున్న యూనివర్సిటీ 2025లోనూ అదే పరంపరను కొనసాగించింది. ఎన్‌విడియ, మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రపంచ అగ్రగామి సంస్థలను ఆకర్షించింది. ప్రపంచ మార్కెట్‌లో ఉద్యోగాల కల్పన సవాలుగా మారిన తరుణంలోనూ 2025 బ్యాచ్‌లో 92.5 శాతం ఆన్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ను సాధించింది. 2025 ప్లేస్‌మెంట్‌ సీజన్‌లో 757 కంపెనీలు కెఐఐటీని సందర్శించి 5 వేల మంది అర్హత కలిగిన విద్యార్థుల్లో నుంచి 4.621 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి.

కెఐఐటీ స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 451 కంపెనీలు 3,800 ఉద్యోగ అవకాశాలను కల్పించాయి. సరాసరిగా సీటీసీ రూ.8.5 లక్షలు (సంవత్సరానికి) కాగా, 739 మంది విద్యార్థులు పలు రకాల అవకాశాలను అందుకున్నారు. ఇక్కడి గ్రాడ్యుయేట్స్‌ పరిశ్రమల అవసరాలకు తగినట్టు తీర్చిదిద్దారు. వచ్చిన ఆఫర్స్‌లో 1,500 ఆఫర్లను డ్రీమ్‌ ఆఫర్స్‌గా గుర్తించగా, 59 కంపెనీలు రూ.10 లక్షలు (సంవత్సరానికి) ప్యాకేజీని ఆఫర్‌ చేశాయి. వచ్చిన ప్యాకేజీల్లో మైక్రోసాఫ్ట్‌ అత్యధికంగా రూ.51 లక్షలు (సంవత్సరానికి) ప్యాకేజీని ఆఫర్‌ చేసింది. టీసీఎస్‌ అత్యధికంగా 530 ఆఫర్స్‌, విప్రో 342 ఇవ్వగా, అదనంగా 1,209 మందికి చెల్లింపులతో కూడిన ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించాయి. ఎన్‌విడియ సీటీసీ అత్యధికంగా రూ.36.28 లక్షలు (సంవత్సరానికి) ఆఫ్‌ ఇచ్చింది. హ్యూమన్‌ రెసోసియా హైక్‌, పేపాల్‌ వంటి కంపెనీలు రూ.30 లక్షలు (సంవత్సరానికి ) ఆఫర్‌ ఇచ్చాయి. స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌ మెంట్‌లో 161 కంపెనీలు 401 ఆఫర్లను ఎంబీఏ విద్యార్థులకు ఇచ్చాయి. వీరిలో అత్యధికంగా రూ.20 లక్షలు (సంవత్సరానికి) ఇవ్వగా, వీరిలో సరాసరిగా రూ.7.25 లక్షలు ప్యాకేజీ ఇచ్చాయి. ఈ విభాగంలో కెఐఐటీ వంద శాతం ప్లేస్‌మెంట్‌ సాధించడం గమనార్హం. ఇందులో 51 కంపెనీలు నియామక పత్రాలు ఇవ్వగా, అత్యధికంగా రూ.20.71 లక్షలు (సంవత్సరానికి) అత్యధిక ప్యాకేజీ కాగా, సరాసరిగా రూ.5.75 లక్షలు (సంవత్సరానికి) ఉంది. స్కూల్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీలో 85 శాతం ప్లేస్‌మెంట్‌ను యూనివర్సిటీ సాధించింది. ఇందులో 42 కంపెనీలు పాల్గొనగా, అత్యధికంగా రూ.8 లక్షలు (సంవత్సరానికి) ప్యాకేజీనిచ్చారు. స్కూల్‌ ఆఫ్‌ లాలో 52 లా ఫర్మ్స్‌ పాల్గొనగా అత్యధికంగా రూ.9.6 లక్షలు (సంవత్సరానికి) ప్యాకేజీని వాడియా ఘాండీ అండ్‌ కెంపనీ ఆఫర్‌ చేసింది. సరాసరిగా రూ.4.5 లక్షలు (సంవత్సరానికి) ఆఫర్‌ దక్కింది.

ప్యాకేజీలు అత్యధికంగా ఇచ్చిన టాప్‌ 10 కంపెనీలివే
కెఐఐటీ ప్లేస్‌మెంట్‌లో సంవత్సరానికి విద్యార్థులకు అత్యధిక ప్యాకేజీని 10 కంపెనీలిచ్చాయి. మైక్రోసాఫ్ట్‌ (రూ.51 లక్షలు), హ్యూమన్‌ రెసోసియా (రూ.44.52 లక్షలు), హైక్‌ (రూ.41.70 లక్షలు), పేపాల్‌ (36.50 లక్షలు), ఎన్‌విడియ (రూ.36.28 లక్షలు), ఇటాగకి కార్పొరేషన్‌ (జెంకన్‌) (రూ.28.98 లక్షలు), జస్పే టెక్నాలజీస్‌ (రూ.27 లక్షలు), సిస్కో (రూ.24.73 లక్షలు), డి.ఇ.షా ఇండియా (రూ.24.30 లక్షలు). 2026లోనూ ఇదే విధంగా ప్లేస్‌ మెంట్‌ ను సాధించనున్నట్టు కెఐఐటీ, కెఐఎస్‌ఎస్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ అచ్యుత సమంత తెలిపారు. కెఐఐటీ నాణ్యమైన విద్యతో పాటు పరిశ్రమల అవసరాలపై శ్రద్ధ పెడుతున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -