Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపిడుగుపాటుకు 94 గొర్రెలు మృత్యువాత

పిడుగుపాటుకు 94 గొర్రెలు మృత్యువాత

- Advertisement -

రూ.10లక్షల నష్టం.. ఆదుకోవాలి : బాధిత గొర్రెల కాపర్లు
నవతెలంగాణ-మహదేవపూర్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం పెద్దంపేట శివారు గోదావరి వద్ద గురువారం రాత్రి భారీ వర్షానికి ఉరుములు మెరుపులతో పిడుగుపడి 94 గొర్లు మృత్యువాత పడిన ఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. అంబటిపెళ్లి గ్రామానికి చెందిన గొర్రె కాపర్లు మేత కోసం పెద్దంపేట శివారులో గోదావరి వద్ద మేపుకొని గొర్రెల మందను కట్టివేసి జాలి పెట్టి రాత్రివేళ భోజనానికి వెళ్లారు. ఈ క్రమంలో గొర్రెల కాపర్లు కాట్రేవుల కత్తరసాల 21, కాట్రేవుల కళ్యాణ్‌ 17, కాట్రేవుల ఆది రెడ్డి 20, కాట్రేవుల మల్లేష్‌ 10, కాట్రేవుల పున్నమి చందర్‌ 15, కాట్రేవుల శ్రీశైలంకు చెందిన 11 మొత్తం 94 గొర్లు పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాయి. తమకు జీవనోపాదైన గొర్రెలు చనిపోవడంతో తాము దిక్కులేని వారమయ్యామని, సుమారు రూ.10లక్షల నష్టం వాటిల్లిందని, తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత గొర్లకాపర్లు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సంఘటనా స్థలానికి జిల్లా వెటర్నరి అధికారి కుమారస్వామి, మండల వెటర్నరీ అధికారి రాజబాబు, మహాదేవపూర్‌ తహసీల్ధార్‌ రామారావు సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం పంచనామ నిర్వహించి చనిపోయిన గొర్రెలను ఖననం చేసినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -