Friday, May 23, 2025
Homeబీజినెస్నికర ఎఫ్‌డీఐల్లో 96 శాతం పతనం

నికర ఎఫ్‌డీఐల్లో 96 శాతం పతనం

- Advertisement -

న్యూఢిల్లీ : విదేశీ పెట్టుబడులకు భారత్‌ ఆశజనకంగా కానరావడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థలో బలహీనతలు డిమాండ్‌ను సన్నగిల్లేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏకంగా 96 శాతం పతనమై 353 మిలియన్‌ డాలర్లకు పడిపోయాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. విదేశీ కంపెనీల ఇక్కడి పెట్టుబడుల నుంచి భారత కంపెనీలకు చెందిన విదేశాల్లోని పెట్టుబడులను తీసేస్తే.. మిగిలేది నికర ఎఫ్‌డీఐలుగా పరిగణిస్తారు.
కరోనా కాలం 2020-21లోనూ ఏకంగా 44 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. తదుపరి ఏడాది 38.6 బిలియన్లు, 2022-23లో 28 బిలియన్‌ డాలర్లు, 2023-24లో 10.1 బిలియన్లుగా చివరగా 2024-25లో కేవలం 0.4 బిలియన్లు (353 మిలియన్లు) ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి. 2024-25లో స్థూల పెట్టుబడులు 81 బిలియన్లుగా, ఇంతక్రితం ఏడాది 71.3 బిలియన్లుగా, 2022-23లో 71.4 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి. అత్యధిక పెట్టుబడులు సింగపూర్‌, అమెరికా, యూఏఈ, మారిషాస్‌, నెథర్లాండ్‌ దేశాల నుంచి అధిక ఎఫ్‌డీఐలు వచ్చాయి. 2024-25లో భారత కంపెనీలు విదేశాల్లో 29.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఇంతక్రితం ఏడాది పెట్టుబడులతో పోల్చితే 75 శాతం పెరుగుదల నమోదయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -