- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1997- 98 ఎస్ఎస్ సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. అప్పటి గురువులు, పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని వేదిక ద్వారా పంచుకున్నారు. గురువులు జగదయ్య, చిన్నకోడూరు ఎంఈఓ యాదవరెడ్డి, మల్లారెడ్డి లను శాలువాలతో ఘనంగా సత్కరించి పాదభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎల్లం, కుమార్, గోపాల్ రెడ్డి, అంజలి, ప్రజ్వల, కళ్యాణి, పలువురు పాల్గొన్నారు.
- Advertisement -