Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్ష సమావేశం 

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్ష సమావేశం 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట 
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీవో మమత అధ్యక్షతన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఓ మమత మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ములుగు  ఆదేశముల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ కార్యాచరణ అమలు కొరకై సమస్త మండల స్థాయి సంబంధిత అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రణాళికలు మూడు ప్రతులతో హాజరైనారు. సర్పంచులకు  కూడా ప్రతులను ఇచ్చిన అనంతరం సంబంధిత  ఈ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమము సంబంధిత 24 శాఖల అధికారులతో ప్రణాళికలు రూపొందించబడిన వాటిని విజయవంతము చేయుటకు గాను  సర్పంచ్ ల తో సమన్వయము చేసుకోవాలని తెలిపినారు.

అన్ని శాఖల అధికారులతో ప్రణాళికలు రూపొందించబడిన ప్రకారము ఈ 99 రోజులలో విజయవంతము చేయాలన్నారు జిల్లాలోనే మన మండలంను ఆదర్శ మండలం గా రూపొందించాలన్నారు ఈ కార్యక్రమం చివరలో అన్ని గ్రామ పంచాయతీలయందు గ్రామసభలు ఉంటాయన్నారు ఆ గ్రామసభలలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే పరిష్కారాలకు చర్యలు గైకొనాలన్నారు.ఈ సమావేశంలో  సర్పంచులు, స్థానిక తహసిల్దార్ సృజన కుమార్, పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్సై ) ఎస్.కె తాజుద్దీన్ పసర,మండల విద్యాశాఖ గొంది దివాకర్, అధికారి, కే జితేందర్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి ,మెడికల్ ఆఫీసర్లు, సంబంధిత డిఆర్డిఏ డిపిఎం స్పెషల్ ఆఫీసర్, ఏపీవో ఈజీఎస్, ఏపీఎం సర్ఫ్, ఫారెస్ట్ అధికారి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, మరియు అన్ని శాఖల ఏఈలు పి ఆర్, ఆర్ అండ్ బి, ఎం.బి ఇంట్రా , ఎలక్ట్రిసిటీ గారలు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -