వతెలంగాణ-రామన్నపేట
సడన్ బ్రేక్ వేయడం వల్ల బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్యాసింజర్ కు గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వలిగొండ మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన యశోద తన బాబాయ్ మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలకు రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి వెళ్లడానికి వలిగొండ మండల కేంద్రంలో నల్లగొండ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఎక్కింది. వలిగొండ మండల శివారులో బస్ కు ఒక కారు ఆకస్మికంగా ఎదురు రావడంతో బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో నిలబడి ఉన్న యశోద బస్సు లోనే క్రింద పడిపోవడంతో గాయాలయ్యాయి. ఆమెను బస్సు డ్రైవర్, కండక్టర్ చికిత్స నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె బంధువులకు సమాచారం ఇవ్వడంతో యువర్ ఆస్పత్రికి వచ్చారు. చికిత్స అనంతరం యశోదను ఆమె బంధువులకు అప్పగించారు. సడన్ బ్రేక్ వేయడంతో మహిళా ప్యాసింజర్ కు గాయాలైన విషయాన్ని నల్లగొండ డిపో మేనేజర్, ఆర్ఎం కు సమాచారం ఇచ్చామని, దగ్గరుండి చికిత్స నిర్వహించి, బంధువులకు క్షేమంగా అప్పగించాలని సూచించారని ఈ సందర్భంగా డ్రైవర్ తెలిపారు.
బస్సు ప్యాసింజర్ కు గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



