– పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు చెన్నయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని వెంటనే విడుదల చేయాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని అన్నారు. ప్రాథమిక పాఠశాలలకు పది వేల పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఈడీ అర్హత గల ఎస్జీటీలకు పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతులకు అవకాశం కల్పించాలని కోరారు. డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని చెప్పారు. 190 జీవో ద్వారా 317 జీవోలో స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని సూచించారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జోనల్ పోస్టులుగా మార్చాలని కోరారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి అన్ని రకాల పదోన్నతులను కల్పించాలనీ, వేసవి సెలవుల్లో బదిలీలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ ప్రధాన కార్యదర్శి బి రత్నాకర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్‌రావు, మహిళా ప్రెసిడెంట్ క్రిష్ణప్రియ, నాయకులు పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ డీఏలను విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES