తెలంగాణ ఉద్యమకారులు
నవతెలంగాణ – ముషీరాబాద్
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకారులుగా తగిన బుద్ది చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ ఉద్యమకారులు అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు సుద్దమళ్ళ వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ఉద్యమ సంఘాల నేతలు, జేఏసీ ప్రతినిధు లు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఉద్యమకారుల నుంచి ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టి.. ఆ పార్టీకి తగిన బుద్ది చెబుతామని హెచ్చరిం చారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించకుండా కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ద కాలం అణచివేతకు పాల్పడిందని, నేడు కాంగ్రెస్ పార్టీ కూడా రెండేండ్లుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉద్యమకారులను మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ కూడా ప్రకటించకపోవడం విచారకరమన్నారు. అందుకే ఉపఎన్నికల్లో పోటీ చేసి ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి ఉద్యమకారుల సత్తా చాటే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ సమాలోచన సదస్సులో టీయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ప్రఫుల్ రామ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్, మోహన్ బైరాగి, అంసోల్ లక్ష్మణ్, నాగుల శ్రీనివాస్ యాదవ్, ప్రజ్యోత్ కుమార్, సుజి, లావణ్య, జానకి రెడ్డి, సుచరిత, 1969 ఉద్యమకారులు బోయపల్లి రంగారెడ్డి, శంకర్‌రావ్ పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES