- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. మాచిల్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నిస్తున్న వారిని భద్రతా దళాలు గుర్తించి, కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఆపరేషన్ కొనసాగుతోంది. శీతాకాలానికి ముందు చొరబాటు ప్రయత్నాలు పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు సరిహద్దుల్లో నిఘా పెంచారు.
- Advertisement -