Tuesday, October 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపట్టుబడ్డ 25 లక్షల నగదు స్వాధీనం ...

పట్టుబడ్డ 25 లక్షల నగదు స్వాధీనం …

- Advertisement -

నవతెలంగాణ – బంజారా హిల్స్ : నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ.25 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నట్లు కీలక సమాచారం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఎన్నికల తనిఖీల్లో భాగంగా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (SST) రూ.25 లక్షల(ఇరవై ఐదు లక్షలు), నగదును స్వాధీనం చేసుకుంది. ఈ నగదు శ్రీ జైరాం తలాసియా అనే వ్యక్తి నుండి స్వాధీనం చేయబడింది. ఆయన విశాఖపట్నం జిల్లాలోని సీతమ్మధర ఎన్.ఈ లేఅవుట్, ఫ్లాట్ నెం.194 నివాసి. ఆయ‌న TS09FF 6111 నంబర్ గల కారు ద్వారా యూసుఫ్‌గూడ వైపు ప్రయాణిస్తుండగా, మైత్రీవనం ఎక్స్ రోడ్ వద్ద సారధి స్టూడియో సమీపంలో SST బృందం తనిఖీ చేయగా, రూ.25 లక్షల నగదు లభ్యమైంది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వాధీనం చేసిన నగదును మధురానగర్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -