Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాంగ్రెస్ నాయకులు

ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం లో కడ్తాల్ మండలం మక్త మాదారం గ్రామంలో మంగళవారం ఉదయం ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. దేశంలో ప్రతి చోట బీజేపీ ఓటు చోరీ చేసింది. ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో 100 మందితో సంతకాల సేకరణ చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించింది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదేశాలతో కడ్తాల్ మండల్ మక్త మధారం గ్రామంలో కల్వకుర్తి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు MD. షాబుద్దీన్ గారు సంతకాల సేకరణ చేయడం జరిగింది. MD. షాబుద్దీన్ గారు మాట్లాడుతూ.. దేశంలో బిజెపి పార్టీ పెద్ద ఎత్తున ఓటు చోరీ చేసి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కోటం సురేష్, యట సురేష్, యట రమేష్,క్రాంతి, కరీం, సమీర్, అశ్విని, మంజుల, నవాజ్, గ్రామస్తులు పాల్గునారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -