Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రగతి విద్యాలయంలో ప్రకాశించిన విద్వత్ కాంతులు

ప్రగతి విద్యాలయంలో ప్రకాశించిన విద్వత్ కాంతులు

- Advertisement -

నవతెలంగాణ – పెబ్బేరు: ప్రాథమిక విద్య చాలా ముఖ్యమైనది విద్యానైపుణ్యాలకు పునాది వేసేది ప్రాథమిక విద్యే. మంచి భవిష్యత్తును నిర్దేశించే విద్యా ప్రమాణాలు ఇక్కడి నుండే మొదలవుతాయి. పెబ్బేరు మండలంవ శాఖాపూర్ లో వెలసిన ప్రగతి విద్యాలయం అనేక మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది వేసింది. ఇక్కడ ప్రాథమిక విద్య అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించారు. గురుకుల సీట్లలో ప్రగతి విద్యాలయం స్టేట్ ర్యాంకులు సాధించిన సంగతి తెలిసిందే.

ఈ సంవత్సరం కూడా ప్రగతి విద్యాలయంలో విద్యనభ్యసించిన ఇద్దరు విద్యార్థులు ఎంబిబిఎస్ లో సీట్లు సాధించారు. శాఖాపూర్ కి చెందిన అస్మత్,రంజాన్ ల కుమారుడు హమీద్ అదేవిధంగా రేణుక, కుర్మయ్యల కూతురు అనుశ్రీ ఎంబిబిఎస్ లో సీట్లు సాధించారు. ఈ ఇద్దరు విద్యార్థులు మా ప్రగతి విద్యాలయం విద్యార్థులని తెలియజేయడానికి గర్విస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడా రాజీపడకుండా  విద్యార్థులకు విద్యనందిస్తున్నాం. వ్యయానికి వెరువక అనుభవజ్ఞులైన ఉపాద్యాయుల ద్వారా నాణ్యమైన విద్యనందిస్తున్నాం.

వై శాఖాపూర్, చుట్టుపక్కల గ్రామాల ప్రజల సంపూర్ణ సహకారంతోనే ఇన్ని విజయాలు సాధ్యమయ్యాయని  సవినయంగా మనవి చేస్తున్నాము. ఎంబిబిఎస్ లో సీట్లు సాధించి మా పాఠశాలకు పేరు తెచ్చిన హమీద్,అనుశ్రీలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా హమీద్, అనుశ్రీలకు ప్రగతి విద్యాలయంలో ఘనంగా సన్మానం జరిగింది. పాఠశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అందరి ఆశీర్వాదంతో విద్యార్థులకు మరిన్ని విజయాలు మా ప్రగతి విద్యాలయం నుండి అందించగలమని హామీ ఇస్తున్నట్లు ప్రగతి విద్యాలయం కరస్పాండెంట్ భీమ్ సాగర్ తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -