నవతెలంగాణ – హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ పోలీసులకు లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయన పోలీసులకు లొంగిపోయారు. కొద్దిరోజుల కిందట తన సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావుకు కిషన్‌జీ పేరుతో వేణుగోపాల్‌రావు ఒక లేఖ రాశారు. అందులో మావోయిస్టు పార్టీ విధానాలపై వేణుగోపాల్‌రావు కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదంటూ మావోయిస్టు పార్టీకి ఆయన రాసిన మరో లేఖ కలకలం రేపింది. దాని తర్వాత ఆయన మావోయిస్టు పార్టీని వీడారు. అనివార్య కారణాలతో పార్టీని వీడుతున్నానని.. ఇకపై పార్టీలో కొనసాగబోనని ప్రకటించారు. ఈ క్రమంలోనే 60 మందితో కలిసి గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయారు.
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్..లొంగిపోయిన మల్లోజుల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES