Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి రెండు రోజుల జైలు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి రెండు రోజుల జైలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష పడిందని ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ మంగళవారం తెలిపారు. ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలోగల వర్ని చరస్తాలో ఎస్సై గంగాధర్ తన బృందంతో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా బోధన్ డివిజన్ శక్కర్ నగర్ కు చెందిన సయ్యద్ ఇషాక్  అను వ్యక్తి మద్యం సేవించి బండి నడుపుతు పట్టుపడగా బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి మద్యం సేవించినట్లు నిర్దారించి, కోర్టు లో ఆసర్పరచగా మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించారని తెలిపారు. పట్టణ పరిధిలో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే వారికీ కూడా ఇదే విధంగా అవుతది, కావున ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు అని పోలీస్ వారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -