Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

- Advertisement -

ఎలక్ట్రిసిటీ పవర్ హౌస్ లో ఉచిత వైద్య శిబిరం కు విశేష స్పందన 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నగరంలోని టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ నిజామాబాద్ ఎలక్ట్రిసిటీ పవర్ హౌస్ వర్ని చౌరస్తాలో వెల్ నెస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉద్యోగులకు మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం కు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎస్ ఈ రవీందర్ మాట్లాడుతూ.. వెల్నెస్ ఆస్పత్రి ఉపాధ్యక్షులు బోదు అశోక్ ఆధ్వర్యంలో వెల్నెస్ బృందంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ సిబ్బందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ నిర్వహించారని తెలిపారు. అదేవిధంగా వెల్నెస్ ఆసుపత్రి ఉపాధ్యక్షులు బోదు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఎలక్ట్రిసిటీ పవర్ హౌస్ లో నిర్వహించి ఉద్యోగులకు సిబ్బందికి పలు రకాల పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశామన్నారు.

ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్యులు కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయిరాం ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ…గుండెపోటు లక్షణాలు (ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, చల్లని చెమట, వికారం, తల తిరగడం) కనిపించినప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. లక్షణాలను గుర్తించడం, తక్షణ చికిత్స తీసుకోవడం, ధూమపానం మానేయడం, రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు గుండెపోటు నివారణకు ముఖ్యం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిజీషియన్ వైద్యులు అపర్ణ, యూరాలజిస్ట్ వైద్యులు ప్రశాంత్ రెడ్డి, ఆర్థోపెటిక్ వైద్యులు భాస్కరరావు, క్రిటికల్ కేర్ వైద్యులు అభినవ్, న్యూరో సర్జన్ కేతావత్ కిరణ్ లు వైద్య సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ నెస్ హాస్పిటల్ మేనేజర్లు హరిన్ కృష్ణ, రాజేష్,ఆసుపత్రి సిబ్బంది రాజశేఖర్ ,శైలేష్ లతోపాటు ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -