నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
కీర దోసకాయపై రైతులకు ఏజిఐ గ్లాస్ ఫ్యాక్టరీ, గ్లోబల్ గ్రీన్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏజి ఐ గ్లాస్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ గోవిందు రాయ్ హాజరై మాట్లాడారు. గ్లాస్ ఫ్యాక్టరీ (సి ఎస్ ఆర్) రైతులకు కీరదోసగా వేసుకోవడానికి పూర్తి సహకారం అందిస్తుందని, మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు గ్లోబల్ గ్రీన్ కంపెనీ తో టై అప్ అయినట్లు తెలిపారు. ఈ కీర దోసకాయలను గ్లోబల్ కంపెనీ కొని ఇతర దేశాలకు ఎగుమతి చేనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ జి ఐ లాస్ట్ ఫ్యాక్టరీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మాయాంకు పాతక్, జనరల్ మేనేజర్ శివరాం, గౌస్ నగర్ రైతువేదిక విస్తరణ అధికారి సతీష్, అగ్రికల్చర్ కోఆర్డినేటర్ కళ్యాణ్, ఆర్గనైజర్స్ రాసాల కొండల్, కోల శివ, పేరబోయిన దుర్గాప్రసాద్, గోబుల్ గ్రీన్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
కీర దోసకాయపై రైతులకు ఏజిఐ గ్లాస్ ఫ్యాక్టరీ అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES