నవతెలంగాణ – దుబ్బాక
మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో వరద నీరు వచ్చి స్కూల్, విద్యార్థినుల హాస్టల్ ప్రాంగణమంతటా నీరు నిలిచి బురదమయం అవుతుంది. గత 13 ఏళ్లుగా ఈ సమస్యతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 వ, 11 వ వార్డుల తాజా మాజీ కౌన్సిలర్లు కూరపాటి బంగారయ్య, నందాల శ్రీజ శ్రీకాంత్ లు.. పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి విద్యార్థినులు పడుతున్న అవస్థల్ని వివరిస్తూ వినతి పత్రాలను అందజేశారు. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ స్పందించి ఈ వరద నీటిని మళ్లించేందుకుగాను వెంటనే 15 వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.7 లక్షలను మంజూరు చేసిందని మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేష్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మంగళవారం మోడల్ స్కూల్లో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనుల్ని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వాతి తో కలిసి పరిశీలించి మాట్లాడారు. బాలికల వసతి గృహం, మోడల్ స్కూల్ ప్రాంగణం నుంచి మెయిన్ రోడ్ వరకు సుమారు 150 మీటర్ల మేర నూతనంగా డ్రైనేజీ నిర్మాణ పనుల్ని చేపట్టడం జరిగిందన్నారు. పైనుంచి వస్తున్న వరద నీటిని డ్రైనేజీల్లోకి మళ్ళించి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చేయడం జరుగుతుందని, అలాగే పాఠశాలలో గ్రావెల్ పనుల్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట వర్క్ ఇన్స్పెక్టర్ బుస్స ప్రవీణ్ కుమార్, హాస్టల్ వార్డెన్ ఉన్నారు.
వరద నీటి ప్రవాహానికి చెక్.. డ్రైనేజీ పనులు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES