Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు కెప్టెన్ గా జ్యోతిబాపూలే విద్యార్థి ఎంపిక 

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు కెప్టెన్ గా జ్యోతిబాపూలే విద్యార్థి ఎంపిక 

- Advertisement -

 నవతెలంగాణ – దుబ్బాక 
త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు కెప్టెన్ గా దుబ్బాక మండలం హబ్సిపూర్ లోని మహాత్మ జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాల విద్యార్థి పీ. రంగ ఎంపికయ్యాడు. ఈనెల 13 న పఠాన్ చెరులో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా జోనల్ లెవెల్ అండర్ -17 ఎస్జీఎఫ్ కబడ్డీ పోటీల్లో 9 వ, 10 వ తరగతి విద్యార్థులు పీ. రంగ, బీ. భాను లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సిద్దిపేట టీం ను ప్రథమ స్థానంలో నిలిపారని ఎంజేపీ ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్ రెడ్డి తెలిపారు. త్వరలో జరగబోవు రాష్ట్ర స్థాయి పోటీలకు తమ విద్యార్థి పీ. రంగ.. కెప్టెన్ గా ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్ని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, పీఈటీ తరుణ్ రాజ్ లు ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -