నవతెలంగాణ – కాటారం
మహాదేవపూర్ ప్రాజెక్టు పరిధిలోని కాటారం మండలంలో సిడిపిఓ రాధిక ఆదేశాల మేరకు సూపర్వైజర్ శివరాణి ఆధ్వర్యంలో మంగళవారం రోజున పోషణ మాసం కొత్తపల్లి గ్రామపంచాయతీ హైస్కూల్లో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీ డి పీ ఓ రాధికా హాజరై మాట్లాడుతూ… గర్భిణీలకు, బాలింతలకు సమతుల్య పోషకాహారం గురించి వివరించారు. అలాగే ప్రతి గర్భిణీ కూడా రక్తహీనతతో ఉండకుండా ఐరన్, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని సూచించారు. చిరు ధాన్యలతో ఆహరం తీసుకోవాలి అని చెప్పారు.ప్రతి ఒక్కరు కూడా గర్భిణీ దశ నుండి డెలివరీ అయ్యే వరకు 10 నుంచి 12 కేజీల బరువు పెరగాలి, ఇమ్యునైజేషన్ కూడా తీసుకొని తగిన విశ్రాంతి అదనంగా ఫీడింగ్ తీసుకోవాలని, కిషోర బాలికలకు రక్తహీనత నివారించడంకోసం ఇందిరమ్మ అమృతంలో మిల్లెట్స్ పల్లి పట్టి( చిక్కిస్) 15 రోజులకొకసారి 15 పీసులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.
ప్రతి ఒక్క కిషోర బాలిక కూడా తీసుకొని సరియైన పోషకాహారాన్ని తీసుకొని హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచుకోవాలని చెప్పడం జరిగినది. వెయ్యి రోజుల ప్రాముఖ్యతను గర్భిణీ దశ నుండి రెండు సంవత్సరాల వరకు తీసుకునే జాగ్రత్తలను గురించి ఏజ్ వైస్ గా వివరించారు. సూపర్వైజర్ శివరాణి మాట్లాడుతూ… గర్భిణీలకు,బాలింతలకు, యువతులకు, వృద్ధులకు సమతుల్య ఆహారం గురించి అవగాహన కల్పించడం కల్పించారు. ఆహారపు పిరమిడ్ గురించి వివరించారు. ఆహారపు పిరమిడ్ లో ఏ ఆహార పదార్థాలు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి లో ఏ ఆహార పదార్థాలు ఎంత క్వాంటిటీలో అన్ని రకాల ఆహారం లు సమతుల్యంగా తీసుకుంటేనే సమగ్ర పోషణా లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్ కళావతి, సూపర్ వైజార్ శివరాణి, హెచ్ యం శారదా, స్కూల్ టీచర్స్ , ఏ ఎన్ యం,అంగన్వాడీ టీచర్స్, ఆశాలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.