కలెక్టర్ ఇలా త్రిపాఠి
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం ఆమె ఎన్జీ కళాశాల మైదానంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు విషయమై ఉదయపు నడక ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్జీ కళాశాల మైదానం నల్లగొండ. కు ఒక మంచి గుర్తింపు అని అన్నారు. ఎన్ జి కళాశాల మైదానంలో మంచి క్రీడా సౌకర్యాలను కల్పించే విషయంలో మున్సిపల్ లేదా జిల్లా యంత్రాంగం నిధులతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా సింథటిక్ వాకింగ్ ట్రాక్, హైమాస్ లైట్లు , ప్రస్తుతం ఉన్న ఓపెన్ జిమ్ కు మరమ్మతులు, అదనంగా ఓపెన్ జిమ్ ఏర్పాటు వంటి అత్యవసర సౌకర్యాలన్నిటిని కల్పించే విషయంపై దృష్టి సారిస్తామని ,ఇందుకుగాను సంబంధిత అధికారులు అంచనాలు రూపొందించి సమర్పిస్తే త్వరితగతిన వాటిని చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అలాగే ఎన్ జి కళాశాల మైదానం స్థలాన్ని ఎవరు ఆక్రమించుకోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ,వాకర్స్ అసోసియేషన్ నుండి బండారు ప్రకాష్, రేపాల మదన్మోహన్, డాక్టర్ పుల్లారావు , గోన రెడ్డి ,సౌరయ్య, కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్, లింగయ్య, మాజీ కౌన్సిలర్ మిర్యాల యాదగిరి, రాచకొండ గిరి, వెంకన్న, యాస వెంకట్ రెడ్డి ,సరళ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ ను శాలువా, మొమెంటులతో సత్కరించారు.
ఎన్జీ కళాశాల మైదానంలో సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES