మల్హర్ లో 50 పూర్తి.!
నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి,అవకతవకలకు తావు లేకుండా, నిజమైన కూలీలకు లబ్ది చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నూతన నిబంధనలు, సంస్కర ణలు తీసుకువస్తోంది. అయినా ఎక్కడో ఒక చోట అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.ఇందుకు నిదర్శనమే.మండలంలో ఇటీవల జరిగిన ఉపాధిహామీ సమాజిక ప్రజావేదిక తనిఖీలో వెలుగు చూసిన పలు అక్రమాలే.వీటికి అడ్డుకట్ట వేసేలా, మరింత పారదర్శకత పెంచేలా జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈకే వైసీ విదానం అమలుకు శ్రీకారం చుట్టింది. మండలంలో మొత్తం 10,700 జాబ్ కార్డులు,21,280 వేల మంది కూలీలు ఉన్నారు.
ఇందులో యాక్టివ్ నిత్యం పనులకు వెళ్లే కూలీలు 10,640 మంది ఉండగా 5,500 మంది కూలీల ఈకెవైసి 50 పూర్తియిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల నుంచి కూలీల ఈకేవైసీ నమోదు ప్రారంభంయిన ఇప్పటి వరకు 50 శాతం పూర్తయింది.త్వరలోనే వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లుగా ఉపాధిహామీ మండల ఎపిఓ హరీష్ తెలిపారు. ఈకేవైసీ పూర్త కూలీలకు మాత్రమే ఉపాధి పనులు కల్పించనున్నట్లుగా తెలిపారు.
ఈకేవైసీ ఇలా..
గ్రామాల్లో పనులకు వెళ్లనివారు సైతం నగదు పొందుతున్నారు. కొన్నిచోట్ల ఉపాధి సిబ్బంది కూడా తప్పుడు హాజరు వేస్తూ లబ్ధి పొందుతు న్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పథకంలో మరింత పారదర్శకతను పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఈకే వైసీ యాప్ లో కూలీ ఫోటో ఆధారంగా పని ప్రదేశంలో కూడా అదే కూలీ ఫొటోను రెండుసార్లు తీయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇతరుల ఫొటో తీసే ప్రయత్నం చేస్తే యాప్లో హాజరు నమోదు కాదు. దీంతో సరైన కూలికి మాత్రమే హాజరు పడటంతో పాటు బినామీలకు అడ్డుకట్ట పడనుందని ఉపాధి హామీ పథకం అధికారులు చెబుతున్నారు.