ఆలేరు అభివృద్ధిపై చర్చ
నవతెలంగాణ – ఆలేరు
ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి తో మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గంధంమల్ల పనుల పురోగతికి వేగంగా పనులు జరిపేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలో మొదటి స్థానం రావడం పట్ల రేవంత్ రెడ్డి అభినందించినట్లు చెప్పారు.రేషన్ కార్డులు సన్న బియ్యం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా కృషి చేయాలని ప్రజలకు అందుబాటులో ఎల్లప్పుడూ ఉండాలని సూచన చేసినట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు మొదటి ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నెం సంజీవరెడ్డి ఉన్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో ప్రభుత్వ విప్ భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES