Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాంరెడ్డి మరణం..కుటుంబానికి తీరని లోటు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

రాంరెడ్డి మరణం..కుటుంబానికి తీరని లోటు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
రాంరెడ్డి మరణం కుటుంబానికి తీరని లోటు అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. మండలంలోని వెలుగొమ్ముల గ్రామానికి చెందిన డీలర్ రామ్ రెడ్డి అనారోగ్యానికి గురై మృతి చెందడంతో మంగళవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి భౌతిక కాయనికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో రేషన్ డీలర్గా మంచి పేరు తెచ్చుకున్నారని, చిన్న వయసులో  అనారోగ్యానికి గురై మరణించడం చాలా బాధాకరమని అన్నారు.

యెన్నం రాంరెడ్డి పార్టీ పట్ల నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేసిన సీనియర్ నాయకులని అన్నారు. ఆయన పార్టీ కోసం చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. ఆయన మరణం కాంగ్రెస్ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రామ్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు  తహసిల్దార్ యూపీ రాజు రామ్ రెడ్డి మృతదేహానికి రెవెన్యూ సిబ్బందితో కలిసి పూలమాలసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు మహ్మద్ గౌస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ కాంతమ్మ, డీలర్ల సంఘం మండల అధ్యక్షులు సత్యం గుప్తా, శేఖర్, వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు ,ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, వెంకటయ్య, మల్లికార్జున రెడ్డి, సాయిలు, విజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, వెంకట శివప్రసాద్, నరసింహ, జాంగిర్, బాదేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సత్యంగౌడ,  బంగారు, విజయ జి బాబా, శేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -