Wednesday, October 15, 2025
E-PAPER
Homeకరీంనగర్డీలాపడ్డా నాయకులు.. తగ్గిన రాజకీయ వేడి

డీలాపడ్డా నాయకులు.. తగ్గిన రాజకీయ వేడి

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ‘స్టే’ ఇచ్చింది. ఇరు వైపులా వాదనలు విన్న నా యస్థానం నాలుగు వారాల పాటు తదుపరి విచారణను వాయిదా వేసింది. రెండు వారాల్లో ప్రభుత్వం, పిటిషనర్ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికలకు మరింతా సమయం పట్టనుంది. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలు అంటూ ఇప్పటి వరకు జరిగిన హడావిడి అంతా సైలెంట్ అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టు ఇచ్చిన వాదానలకు కట్టుబడి ఉంటామని ప్రకటన చేయడంతో గురువారం జడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడతకు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా రద్దు అయినట్టే… గతంలో చెప్పినట్టు ప్రభుత్వం మరో షెడ్యూల్ విడుదల చేస్తుందా..? లేక న్యాయస్థానం చెప్పినట్టు మరో నాలుగు వారాలు వెయిటింగ్లో పెడుతుందా అనేది వేచి చూడాల్సిందే.

స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి అని అధికార పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు పల్లెలో ఒకరికొకరు పొటా పోటీగా నేను అంటే నేను ఎంపీటీసీ, జెడ్పీటీసీ అని ప్రకటించుకుంటూ ప్రచారాలు చేసుకున్నారు. నామినేషన్లు వేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్న సమయంలో హై కోర్టు తీర్పు రావడం.. స్టే విధించడంతో ఒక్కసారే నిరుత్సాహంలో పడ్డారు. తంగళ్ళపల్లి మండలంలో మొత్తం 30 పంచాయతీలు ఉండగా వాటిలో 14ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానానికి అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులు మధ్య పోటా పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో కోర్టు తీర్పుతో ఒక్కసారే ఇరు పార్టీలు నాయకులు అయేమయంలో పడ్డారు. ఒకానొక ఒక దశలో కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీ నాయకులు జనరల్ స్థానాలైన జెడ్పిటిసి తోపాటు పలు ఎంపీటీసీ స్థానాల్లో పోటీ పడుతూ గ్రామాల్లో గ్రూపులుగా విడిపోతూ ప్రచారాలు ఇప్పటికే మొదలుపెట్టారు.

  ఏది ఏమైనా కోర్టు తీర్పుతో బీసీ రిజర్వేషన్ మారి 2019 రిజర్వేషన్ వచ్చినా… 42 శాతం రిజర్వేషన్ వచ్చినా.. గ్రామాల్లో పార్టీలు కండవులా మార్చేందుకు చోట లీడర్లు ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలుపెట్టి సామాన్య ఓటర్లను ఎవరికి వారు వారి వెంట తిప్పుకుంటున్నారు. ఏది ఏమైనా రిజర్వేషన్ ఉత్కంఠ పల్లెల్లో వున్న ప్రజా ప్రతినిధులుకు నిద్ర లేకుండా చేస్తుంది.

చిగురిస్తున్న ఆశలు..

గత 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం లో మండలంలోని ముఖ్య నాయకులకు ప్రజాప్రతినిధులకు ఆశలు గల్లంతయ్యాయి. కానీ 42 శాతం రిజర్వేషన్ కేసు హైకోర్టులో న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యింది. దీంతో ముఖ్య నాయకుల్లో గల్లంతయిన ఆశలు చిగురిస్తున్నాయి. రిజర్వేషన్లను 50 శాతం కు మించకుండా ఎన్నికల నిబంధనలకు లోబడి ఎన్నికలను నిర్వహించుకోవచ్చు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో నాయకుల్లో ప్రజాప్రతినిధుల్లో ఆశలు చిగురించాయి.

గల్లంతవుతున్న ఆశలు…

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ ప్రకారం ఎన్నికల అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లను ప్రకటించడంతో గ్రామాల్లో ప్రజాప్రతినిధుల్లో నాయకుల్లో ఆశలు చిగురించాయి. స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పిటిసి, సర్పంచ్ స్థానాలకు అధికారులు రిజర్వేషన్లు ప్రకటించడంతో పోటీ చేయాలనుకున్న నాయకులకు అనుకూలంగా రావడంతో గ్రామాల్లో ప్రచారాన్ని మొదలుపెట్టారు. దీంతో హైకోర్టులో కేసు ఎన్నికలకు బ్రేక్ పడడంతో నాయకుల  ఆశలన్నీ అడియాశలు అయ్యాయి.

కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలను నిర్వహించుకోవచ్చు అని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పువ్వులు ఊరుతు.. ఆశలు పెట్టుకున్న నాయకుల ఆశలు ఆవిరి అయ్యాయి. దీంతో గ్రామాల్లో ప్రచారం మూగబోయింది. మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది, రిజర్వేషన్ ఎలా రానుంది, ఎవరెవరు పోటీ చేసేందుకు ముందుకు వస్తారని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -