Wednesday, October 15, 2025
E-PAPER
Homeజిల్లాలుకొనసాగుతున్న టిప్పర్స్ అసోసియేషన్ సమ్మె.!

కొనసాగుతున్న టిప్పర్స్ అసోసియేషన్ సమ్మె.!

- Advertisement -

అధికారులతో చర్చలు విఫలం
నవతెలంగాణ – మల్హర్ రావు

బొగ్గు రవాణాలో చెల్లించే చార్జీలు పెంచాలంటూ మండల టిప్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి సమ్మెకు చేపట్టారు. అయితే మంగళవారం జెన్కో అధికారులచే భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిఎం కార్యాలయంలో టిప్పర్ యూనియన్లచే చేపట్టిన చర్చలు విపలమైయ్యాయి. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు గిరినేని రాజేశ్వరరావు మాట్లాడారు. గతంలో టన్నుకు రూ.250 చెల్లిస్తున్నారని, అవి ఏ మాత్రం సరిపోవడంలేదంటూ,తన్నుకు రూ.300 చరిల్లించాలంటూ సమ్మె బాట పట్టినట్లుగా తెలిపారు.అయితే చివరికి టన్నుకు రూ.265 ఇవ్వాలని అధికారులను కోరగా ససేమిరా అనడంతో చర్చలు విఫలమైయ్యాయని తెలిపారు. చార్జీలు పెంచాలని ఎనిమిది నెలలుగా ట్రాన్స్ పోర్ట్ అధికారులకు విన్నవించినా పట్టించుకొలేదన్నారు. టన్నుకు రూ.250 చెల్లిస్తే డీజిల్,మేంటనెన్స్,డ్రైవర్స్ జీతాలు పోను తమకు రూపాయి మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పునరాలోచించి టన్నుకు రూ.300 చెల్లించెంతవరకు సమ్మె విరమించమని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -