నవతెలంగాణ – జుక్కల్
సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జుక్కల్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్వో మారుతికి మంగళవారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వినతిపత్రంలో భారతీయ కిసాన్ సంఘ్ శాఖ సబ్యులు పేర్కొంటూ మండలంలో 30 గ్రామ పంచాయతీలకు గానూ అధికారిక లెక్కల ప్రకారం 39వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉంది. అందులో16 వేల 159 ఎకరాలు సారా సాగు రైతులు చేస్తున్నారు.
ఈ సారి భారీ వర్షాలకు సోయా పంట దిగుబడి తగ్గింది. ఎకరాకు 5 నుంచి 6 క్వీంటాలు దిగుబడి ప్రస్తుతం వస్తుంది. 1 ఎకరాకు 6 క్వీంటాల లెక్కల ప్రకారం సుమారు 90 వేల నుండి లక్ష క్వీంటాల వరకు దిగుబడి అంచనా ఉంది. మండలంలో నేటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఎమ్మార్వోకు ఇచ్చిన వినతిపత్రం లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల కీసాన్ సంఘ్ అధ్యక్షులు బసవరాజు రెడ్డి, డివిజన్ కార్యదర్శి లక్షెట్టి కృష్ణ, కార్యకర్తలు కిషన్ గొండా, కిరణ్ పటేల్ , మలుగొండ, ప్రశాంత్ పటేల్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మార్వోకు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES