Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత మత్తుకు బానిస కావద్దు: ఎస్ఐ లక్ష్మారెడ్డి 

యువత మత్తుకు బానిస కావద్దు: ఎస్ఐ లక్ష్మారెడ్డి 

- Advertisement -

– పిల్లలు ఏం చేస్తున్నారో.. తల్లిదండ్రులు గమనించాలి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్  

యువత గంజాయి ఇతర మత్తుపదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి అన్నారు. హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు  కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మంత్రాలు తంత్రాలు అంటూ మూఢనమ్మకాలు నమ్మవద్దన్నారు. యువత ఆన్లైన్ గేమ్స్ ఆడి మీరు మీ కుటుంబాలను రోడ్డున పడవేయవద్దని సూచించారు. పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని, ఎక్కడికి వెళుతున్నారు.. ఎవరెవరితో తిరుగుతున్నారని కన్నేసి ఉంచాలని తెలిపారు.

ఆశ, భయము, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. బ్యాంకు అధికారులు అని ఫోన్ చేస్తే నమ్మవద్దనీ, అకౌంట్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ గుర్తుతెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దని సూచించారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలు అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న డి అడిక్షన్ సెంటర్లో చికిత్స మరియు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు గురించి గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు సీసీ కెమెరాలు 24 గంటలపాటు ప్రజలకు  సెక్యూరిటీని ఇస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు, యువతి యువకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -