బీటీ రోడ్ల నిర్మాణానికి 24 కోట్ల 30 లక్షలు మంజూరు
పాలకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
పాలకుర్తి నియోజకవర్గం లోని తండాలకు, ఆవాస ప్రాంతాలకు, గూడాలకు అనుసంధానంగా ఉన్న లింకు రోడ్లకు మహార్దశ కలిగిందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని లింకు రోడ్ల అభివృద్ధికి 24 కోట్ల 30 లక్షల నిధులతో బీటీ రోడ్లను నిర్మించేందుకు నిధులను మంజూరు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల పత్రాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని తెలిపారు. అభివృద్ధిలో పాలకుర్తిని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని సదుద్దేశంతో నిధులను మంజూరు చేస్తున్నారని తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసిందని అన్నారు. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లను త్వరిత గతిన పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఇటీవల వెయ్యి 12 కోట్ల నిధులను మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. నియోజకవర్గంలోని తండాలకు, ఆవాస ప్రాంతాలకు, గూడాలకు ఫార్మేషన్ రోడ్లు, బీటీ రోడ్లు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీటీ రోడ్లను నిర్మించి ప్రజల సమస్యలను తీర్చేందుకే ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని అన్నారు. నిధుల మంజూరు తో గిరిజన తండాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు దృష్టి పెట్టిన మంత్రి లక్ష్మణ్ ను గిరిజనుల తరఫున ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం లో గిరిజన జనాభా ఎక్కువగా ఉందని, గిరిజనుల జనాభాను దృష్టిలో పెట్టుకుని బంజారా భవనాలను మంజూరు చేయాలని మంత్రిని కోరామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. స్పందించిన మంత్రి త్వరలోనే నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.
లింకు రోడ్లకు మహార్దశ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES