Wednesday, October 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుRoad Accident: రెండు బైకులు ఢీ… ఒకరు మృతి

Road Accident: రెండు బైకులు ఢీ… ఒకరు మృతి

- Advertisement -

బైకుల పైన నుంచి వెళ్లిన ట్రాక్

పలువురికి గాయాలు

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్

యాదగిరిగుట్ట మండలం కాచారం మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం కాచారం గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫామ వద్ద రాజపేట వైపు నుండి ఆలేరు వైపు (TS-30G- 9895), ఆలేరు వైపు నుండి రాజపేట రోడ్డు వైపు వెళ్తున్న బైకు ( AP 29 U 6641) లు ఎదురు ఎదురుగా గుద్దుకొని బైకుపై ఉన్నవారు రోడ్డుపై పడిపోగా, అదే సమయంలో అతివేగంగా వెనుక నుంచి వచ్చిన అశోక్ లేలాండ్ వాహనము నెంబర్ (AP 36 TB 3369) బైక్ ల మీద నుండి వెళ్లడంతో (TS-30G- 9805) బైక్ పై ప్రయాణిస్తున్న బేగంపేట గ్రామానికి చెందిన కూలి పని చేసుకునే నీల నరసింహులు(48) అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే ఈ బైక్ పై వెళ్తున్న సడల నరసింహులుకి కుడికాలు విరిగినది, ఇంకో బైక్ పై వెళ్తున్న వ్యక్తులకు కూడా రక్త గాయాలు అయ్యాయి. ఈ విషయంలో మృతుడు భార్య నేల సిద్ధమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -