రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 44 దేవి తండా వద్ద ఆదివారం  జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కందకురి కుమార చారి (46) ద్విచక్ర వాహనం ఢీ కొన్న తర్వాత లారీ పై నుండి వెళ్ళడంతో అక్కడికక్కేడే మృతి చెందినట్లు పోలిసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కందకురి కుమార చారి తన ద్విచక్ర వాహనంపై నిజామాబాదులో ఉంటున్న అతని బావ వద్దకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా రాంగ్ రూట్ నుండి ఎదురుగా వస్తున్న మరొక ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో కుమార చారి కింద పడ్డాడని, అదే సమయంలో వెనుక నుండి వస్తున్న లారీ పై నుంచి వెళ్లడంతో ఘటన స్థలంలోని కుమార చారి అక్కడి కక్కేడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మృతుడి తల నుజ్జునుజ్జు అయ్యింది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనం, లారిని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కుటుంబ సబ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Spread the love