- Advertisement -
- తారు రోడ్డుపై మట్టిని తొలగించిన ఫైబర్ కేబుల్ కూలీలు
నవతెలంగాణ – రాయికల్
పట్టణంలో ఫైబర్ కేబుల్ తవ్వకాల కారణంగా తారు రహదారిపై పేరుకుపోయిన మట్టిని సోమవారం సంబంధిత సంస్థ కూలీలు తొలగించారు. ఈ నెల 10న నవతెలంగాణ దినపత్రికలో “ఇష్టారాజ్యంగా ఫైబర్ కేబుల్ తవ్వకాలు” శీర్షికన, రోడ్లపై మట్టి వాహనదారులకు చుక్కలు ఉపశిర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, కథనం వెలువడిన వెంటనే అధికారుల ఆదేశాలతో సంబంధిత సిబ్బంది మట్టిని శుభ్రపరిచి రహదారిని సవ్యంగా మార్చే చర్యలు చేపట్టారు. సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన నవతెలంగాణకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



