Friday, July 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుటీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

- Advertisement -

హీరో నాని నటిస్తున్న పాన్-వరల్డ్ సినిమా ‘ది ప్యారడైజ్’. దర్శకుడు శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో ఎస్ ఎల్ వి సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఈనెల 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్‌డేట్‌తో సినిమాపై నెలకొన్న ఆసక్తి మరింత పెరిగింది. 1 నిమిషం 35 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌లో సినిమా వరల్డ్ తో పాటు కథలోని ఎమోషనల్ ఇంటెన్సి టీని చూపించబోతున్నారు. మేకర్స్ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారో చూడాలని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోహన్ బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయాల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సంగీతం : అనిరుధ్ రవిచందర్, కెమెరా : సీహెచ్ సాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -