నవతెలంగాణ-కుభీర్
వివో ఏ లు గత కొన్ని రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈనెల 18 నుంచి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వి ఓ ఏ లందరూ శాంతియుత నిరవాధిక సమ్మె చేపడుతున్నట్లు సంఘం అధ్యక్షులు సవిత తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ఏపీఎం దత్తాత్రి కి అమ్మ నోటీసు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వి ఓ ఏ ల దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, కనీస వేతనం రూ.20000 కు పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సెర్ప్ ఉద్యోగులకు గుర్తించి హెచ్ఆర్ఏ వర్తించేలా చూడాలన్నారు. అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించి భారత బీమా రూ.20 లక్షలు కల్పించాలన్నారు. 58 జీవోను సవరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వి ఓ ఏ కార్యదర్శి జయశ్రీ, కోశాధికారి భూమన్న, వి ఓ ఏ లు సాయినాథ్, సురేష్, జీవన్, లతీఫ్ తదితరులు ఉన్నారు.
విఓఏ ల సమస్యలను పరిష్కారానికై సమ్మె
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



