Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవజాత శిశువుకు పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టాలి 

నవజాత శిశువుకు పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టాలి 

- Advertisement -

ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి స్వరాజ్యం   
నవతెలంగాణ-ఆలేరు టౌను 

నవజాత శిశువుకు పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టాలని, సిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి (సిడిపిఓ) స్వరాజ్యం రేకల తెలిపారు. ఐసిడిఎస్ ఆలేరు ప్రాజెక్ట్ కార్యాలయంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ.. గర్భిణీ బాలింతలు, వారి భర్తలకు తల్లిపాల ప్రాముఖ్యత వివరించారు. తల్లిపాలే ప్రతి బిడ్డకు తొలి హక్కు అని, సరైన పోషణ  ప్రతి తల్లికి మద్దతు ఇవ్వడం, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఎదగడం చూడడం – కుటుంబంలో బాధ్యత అన్నారు. తల్లిపాలను ప్రోత్సహించి, ఆరోగ్యవంతమైన, పోషకాహార లోపం రహిత తెలంగాణ నిర్మాణానికి కలిసి కృషి చేద్దమాని చెప్పారు.

తల్లిపాలు శిశువుల మనుగడ, పోషణ, ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైనవని, మొదటి ఆరు నెలల వరకు శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు, రోగనిరోధక శక్తిని తల్లిపాలే అందిస్తాయని, తల్లుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, అనేక వ్యాధుల నుండి శిశువును కాపాడతాయని పేర్కొన్నారు. మొదటి ఆరు నెలలపాటు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని సూచించారు.  రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు వయసుకు తగిన అనుబంధ పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించడం శిశువులకి ఆరోగ్య ప్రధమన్నారు.

తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లి పిల్లలకు ప్రయోజనం ఉంటుందన్నారు. పుట్టిన ఒక గంటలోపు తల్లిపాలు ప్రారంభించిన నవజాత శిశువుల శాతం ఎన్ ఎఫ్ హెచ్ ఎస్- 5లో 37.1% నుండి -6లో 57.1%కు పెరిగిందని వివరించారు. తల్లిపాలు తప్ప నీరు, జంతుపాలు లేదా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు దివ్య,ఉమారాణి, అండాలు, నజమునిస, జ్యోతి, మనోహర  పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ ప్రతికంఠం, రత్నం, రాజు  భార్య భర్తలు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -