నవతెలంగాణ – టేకుమట్ల
భార్యపై హత్యయత్నానికి పాల్పడిన భర్తను అరెస్టు చేసినట్లు ఎస్సై అమూల్య తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..ఆరేపల్లి గ్రామానికి చెందిన దొంగల కోమలకు మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమిటిపల్లి గ్రామానికి చెందిన దొంగల రాజేందర్ తో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. గత రెండు సంవత్సరాల నుండి రాజేందర్ మద్యం సేవించి కోమలను శారీరకంగా, మానసికంగా వేధించగా.. భరించలేక పుట్టిల్లు ఆరెపల్లికి రావడంతో రాజేందర్ కోమలపై కోపం పెంచుకొని ఈనెల ఒకటో తారీకున మద్యం సేవించి ఆరెపల్లికి వచ్చి భార్య కోమలతో గొడవ పడి కత్తితో పొడిచి చంపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కోమల తన చేతిని అడ్డుపెట్టగా చేతికి, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ లో బాధితురాలు కోమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. మంగళవారం రాఘవరెడ్డి పేట్ శివారులో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా రాజేందర్ ను పట్టుకొని విచారణ చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్సై అమూల్య తెలిపారు.
భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

