నవతెలంగాణ-హైదరాబాద్ : రాజీవ్ యువ వికాసం పథకం విషయంలో కీలక అప్ డేట్ వెలువడింది. నవంబర్ 19 నుంచి రాజీవ్ యువ వికాసం పథకం కింద అర్హులకు రూ.1 లక్ష వరకు స్వయం ఉపాధి ఆర్థిక సాయం అందించేలా చర్యలు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పనితీరుపై ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఇందిరమ్మ రాజ్యంలో పేద, బహుజన వర్గాల సంక్షేమం, విద్యాభివృద్ధి, యువతకు స్వయం ఉపాధి కల్పనే మా ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని విద్యారంగ అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తామని భట్టి స్పష్టం చేశారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు కేంద్రీకృత వంటశాలల ఏర్పాటును వేగవంతం చేయాలని, పూర్వ విద్యార్థుల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని సూచించినట్లు భట్టి తెలిపారు. అలాగే స్టడీ సర్కిళ్ల ద్వారా అత్యుత్తమ శిక్షణ, ఎస్సీ డిగ్రీ కళాశాలల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టే దిశగా నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..రూ.1 లక్ష సాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



